రాబోయే పండుగల సీజన్లో చక్కెర ధరలకు కళ్లెం వేయడంతో పాటు అక్రమ నిల్వలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద ఉండే చక్కెర నిల్వల పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


