కొరోనరీ యాంజియోగ్రఫీ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను (కొరోనరీ ఆర్టరీస్) పరిశీలించి, వాటిలో ఏవైనా పూడికలు (బ్లాకేజీలు) లేదా అడ్డంకులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేసే ఒక ఇమేజింగ్ పరీక్ష. మణికట్టు (చేతి) లేదా గజ్జల్లోని రక్తనాళం ద్వారా ఒక ప్రత్యేకమైన కాంట్రాస్ట్ డై (రంగు ద్రవం)ను శరీరంలోకి పంపి, ఎక్స్-రే ద్వారా గుండె నాళాల్లో రక్తం ఎలా ప్రవహిస్తుందో చూస్తారు.
యాంజియోగ్రఫీకి, యాంజియోప్లాస్టీకి తేడా ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు యాంజియోగ్రఫీని సూచిస్తారు, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఏం చేయాలి? ఇలా పూర్తి వివరాల్ని డాక్టర్ చిరాగ్ డి (కన్సల్టెంట్ – ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


