అనకాపల్లి జిల్లా కృష్ణంపాలెం గ్రామస్థుల ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ కారణంగా కాలుష్యం ఎదురవుతోందని గ్రామస్థులు సోషల్ మీడియా ద్వారా పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. ఆ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు, చిమ్నీ ఏర్పాటు చేసిన తర్వాతే కమిషనింగ్ ప్రారంభించాలని అధికారులు.. పరిశ్రమ వర్గాలకు తేల్చి చెప్పారు.
కాలుష్యంపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి అధికారులు
RELATED ARTICLES


