AP Ganesh Mandapams Free Power: వినాయక చవితి సందర్భంగా మంత్రి లోకేష్ తీపికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రజలు వినాయచవితిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది కూడా ఏపీ ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు వినాయక చవితి మండపాలకు అనుమతుతలు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.


