ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య పరీక్షల అనంతరం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అధికారులు అర్ధరాత్రి వేళ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మళ్లీ రావల్పిండిలోని అడియాల జైలు గదికి తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని జైలులో ఉండవచ్చని వైద్యుల బృందం స్పష్టం చేసింది. దాంతో ఆయనను తిరిగి జైలుకు పంపారు.
అర్ధరాత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్చి.. కొద్ది గంటల్లోనే మళ్లీ జైలుకు తరలింపు!
RELATED ARTICLES


