ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ తెలుగు సినీ చరిత్రలో చెరగని రికార్డులను నమోదు చేసింది. స్టార్ హీరోలు లేకపోవడం, 12 శాస్త్రీయ గీతాలు ఉండటంతో ప్రారంభంలో తీవ్ర అపహాస్యాలు ఎదుర్కొన్న ఈ చిత్రం 1980 ఫిబ్రవరి 2న విడుదలయ్యాక తొలి వారం నామమాత్రపు వసూళ్లే సాధించింది. అయితే చిత్ర బృందం చేపట్టిన ప్రత్యక్ష ప్రచారం, ప్రేక్షకుల మౌత్ టాక్తో అనూహ్య ప్రభంజనం మొదలైంది. ఏడాదికి పైగా నిరాటంకంగా ఆడుతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. జేవీ సోమయాజులు, మంజు భార్గవిల అద్భుత నటన, కేవీ మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం ఈ కళాఖండాన్ని నిత్యనూతనంగా నిలబెట్టాయి.
అపహాస్యాలు దాటుకుని అఖండ విజయం… నాలుగు దశాబ్దాలు దాటినా తరగని ‘శంకరాభరణం’ వైభవం
RELATED ARTICLES


