షాద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల మెట్లు దిగుతుండగా జారిపడిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ బాలిక మెట్లపై నుంచి పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తమకు సరైన సమాచారం ఇవ్వలేదని విద్యార్థిని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబంలో, పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది.


