HomeAndhra Pradeshవెలిగొండ ముంపు ప్రాంతాలకు రాకపోకల నిలిపివేత.. ఇళ్లలోనే వస్తువులు, గొడ్లు ఉన్నాయంటూ గ్రామస్తుల కన్నీళ్లు!

వెలిగొండ ముంపు ప్రాంతాలకు రాకపోకల నిలిపివేత.. ఇళ్లలోనే వస్తువులు, గొడ్లు ఉన్నాయంటూ గ్రామస్తుల కన్నీళ్లు!

వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచర్లకు వెళ్లే రోడ్డు మార్గాన్ని అధికారులు మూసేశారు. ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు కృష్ణా జలాలను నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. అదే రోజు రాత్రి నీటి ప్రవాహం దాటికి సుంకేసుల – కలనూతల మార్గంలో బొలెరో వాహనం బోల్తా కొట్టడం అందులోని ముగ్గురు వ్యక్తులు చెట్టు పైకెక్కి ప్రాణాలు నిలుపుకోవడం, మరో వ్యక్తి గల్లంతవడం జరిగింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గాన్ని మూసేశారు. కానీ, తమ వస్తువులు.. పాడి సంపద గ్రామాల్లోనే ఉండిపోయాయని ముంపు ప్రాంత వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments