
అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.రాజమహేంద్రవరంలో జరిగే జిల్లా కోర్టు 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకల్లో సీఎం పాల్గొంటారు.
ఉదయం 9.30 గంటలకు అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు.ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.05 గంటల వరకు మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్లో జరిగే వేడుకల్లో పాల్గొని, మధ్యాహ్నం 01.45 గంటలకు అమరావతి చేరుకుంటారు.


