అందరి చర్మ రంగు ఒకేలా ఉండదు. కానీ, ఆ చర్మ రంగు మొత్తానికి ఒకేలా ఉండాలి. అలా కాకుండా శరీరంలో కొన్ని చోట్ల మంచి రంగులో ఉండి మరికొన్ని చోట్ల జిడ్డు పేరుకుపోయినట్లుగా నల్లగా ఉంటే అస్సలు బాగోదు. చాలా మందికి చర్మ రంగు బాగానే ఉంటుంది. కానీ, మోకాళ్ళు, మోచేతులపై ఉన్న రంగు కంటే ఎక్కువగా నలుపుదనం పేరుకుపోయి ప్యాచీగా మారుతుంది. దీనికి కారణాలు బోలెడు ఉంటాయి. అయితే, మనం ఆ కారణం తెలుసుకోవడానికి ముందుగా కచ్చితంగా డెర్మటాలజిస్ట్ని కలవాలి. వారి సలహాతోనే సమస్య తగ్గుతుంది. మన బాడీలో ఎలాంటి సమస్య లేనట్లైతే కొన్నిసార్లు సమస్యకి ఇంటి చిట్కాలు హెల్ప్ అవుతాయి.


