గాజులు అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు. మట్టిగాజులు, గాజు గాజులు, మెటల్ గాజులు, లక్క గాజులు ఇలా చెప్పుకుంటూ పోతే అందులోనూ రకరకాల మోడల్స్ వస్తుంటాయి. ఎన్ని వచ్చినా అవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌గా కనిపించాలి. అటూ సాంప్రదాయంగానూ మెప్పించాలంటే గాజులే ఫస్ట్ చాయిస్. పైగా మనకి ఉన్న బడ్జెట్లోనే వీటిని ఈజీగా కొనేయొచ్చు. అందుకే గాజులని ఎక్కువగా కొంటుంటారు ఆడవారు. అంతేనా, సాంప్రదాయంగానూ ఎవరైనా ఎక్కడికి వెళ్లినప్పుడు తాంబూలంలో గాజులు ఇవ్వడం, ఏదైనా పుణ్యక్షేత్రాల నుంచి వచ్చేటప్పుడు మనవారికోసం అంటూ గాజులు తీసుకురావడం ఇది ప్రతీ ఒక్కరి విషయంలోనూ జరిగే ఉంటుంది. అందుకే, ఆడవారి దగ్గర బోలెడు గాజులు ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ఆ కలర్స్ ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ కొనుక్కొస్తుంటాం. మరి పాత గాజుల పరిస్థితి ఏంటి. కొన్ని పగిలాయని పారేసినప్పటికీ మంచిగా ఉన్నవాటిని పక్కనపెట్టలేం, పారేయలేం. అలాంటప్పుడు వాటినే మనకి యూజ్ అయ్యేవిధంగా మంచి క్లిప్ స్టాండ్‌లా చేస్తే బాగుంటుందిగా.


