ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్క మహిళకు ఎంతో అందమైన అనుభవం. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు డాక్టర్ల సలహా అవసరం. ఇక, చాలా మందికి ఓ సందేహం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో డ్రైవింగ్ సురక్షితమేనా? దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు డాక్టర్ ఎం. వి. జ్యోత్స్న (కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిషియన్ & గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). గర్భధారణ సాధారణంగా సాగుతూ, కాబోయే తల్లి ఎలాంటి అసౌకర్యం లేకుండా, అప్రమత్తంగా ఉండి వాహనాన్ని అదుపు చేయగలిగే స్థితిలో ఉంటే డ్రైవింగ్ చేయడం సాధారణంగా సురక్షితమే. అయితే, నెలలు గడిచేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు, శారీరక లక్షణాలు డ్రైవింగ్ భద్రతపై ప్రభావం చూపుతాయి. ట్రైమిస్టర్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ ఎం. వి. జ్యోత్స్న అందించారు.


