TDS Returns Deadline: పన్ను మినహాయింపు చేయడమే కాకుండా, దానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేయడం, సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా అంతే ముఖ్యం. రెండవ త్రైమాసికానికి (జులై నుంచి సెప్టెంబర్ వరకు) సంబంధించిన టీడీఎస్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, సర్టిఫికెట్లు జారీ చేసేందుకు గడువు తేదీలు సమీపిస్తున్నాయి. అక్టోబర్ 31వ తేదీ లోపు టీడీఎస్ రిటర్న్స్ సమర్పించకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


