మనం ఇంట్లో రోజువారీ పనులు చేసేటప్పుడు తెలిసో లేదా తెలియకో ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పెద్ద తలనొప్పిని తీసుకువస్తాయి. అలాంటి తప్పుల్లో నూనె ఒలికిపోవడం ఒకటి. పొరపాటున నూనె కింద పడితే పెద్ద తలనొప్పిగా మారుతుంది. దాన్ని శుభ్రం చేయడానికి సమయం, శ్రమ రెండూ వృధా అవుతాయి. పైగా తుడిచే గుడ్డ లేదా మాప్ జిడ్డుగా మారి, దాన్ని ఉతకడానికి మరో పెద్ద పని పెట్టుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ సరిగ్గా క్లీన్ చేయకపోతే నేల జారే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా జిడ్డు మరకలు చూడటానికి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. నేల లేదా కిచెన్ స్లాబ్ మీద నూనె పడితే ఎలా శుభ్రం చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. ఇలాంటి సమయంలో కొన్ని సింపుల్ చిట్కాలు ఎంతగానో సాయపడతాయి. ఆ సింపుల్ చిట్కాలేంటో ఓ లుక్కేద్దాం.


