నేపాల్లో మరోసారి వరద బీభత్సం సృష్టించింది. బుధీ గండకీ నదికి ఆకస్మికంగా వరద రావడంతో పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. 35కి పైగా ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోగా.. జలవిద్యుత్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. కొద్ది సమయంలోనే నదిలో నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షం లేకుండానే వరద రావడం వెనుక నదీ ప్రవాహానికి తాత్కాలిక అడ్డంకి ఏర్పడి.. అది ఒక్కసారిగా తెగిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. నేపాల్ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.
నేపాల్లో మళ్లీ వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు, బ్రిడ్జిలు.. హైడ్రోపవర్ ప్రాజెక్టు ధ్వంసం
RELATED ARTICLES


