HomeLifestyleనాటుకోడిని తలదన్నే నల్లకోడి.. షుగర్ ఉన్నవారికి వరం.. కేజీ ధరతో 2 కేజీలు మేక మాంసం?

నాటుకోడిని తలదన్నే నల్లకోడి.. షుగర్ ఉన్నవారికి వరం.. కేజీ ధరతో 2 కేజీలు మేక మాంసం?

నాటుకోడిని తలదన్నే నల్లకోడి.. షుగర్ ఉన్నవారికి వరం.. కేజీ ధరతో 2 కేజీలు మేక మాంసం?

కడక్నాథ్ కోడి, సాధారణంగా నల్లకోడి అని పిలిచే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రుచిలో దేశీ కోడి కంటే చాలా మంచిది, చూడటానికి నల్లగా కనిపించినా దాని పోషక విలువలు చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.ఈ కోడి మాంసం బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. కడక్నాథ్ కోడి తన ప్రత్యేక రుచి, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఇటీవల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అరుదైన అడవి జాతి కోళ్లను మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి పెంచి విక్రయిస్తుంటారు. కరోనా సమయంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.కడక్నాథ్ మాంసంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇతర కోడి జాతులతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీనిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ. నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.కడక్నాథ్ కోడిని సాధారణ చికెన్ మాదిరిగానే వండుకోవచ్చు, అయితే నాటుకోడి వంటకాల్లాగే రెడీ చేయాలి. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులు దీనిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. కేజీ కడక్నాథ్ కోడి మాంసం రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments