
ఎర్రగుంట్ల:
ఎర్రగుంట్లకు చెందిన ధర్మతేజారెడ్డికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం లభించింది.చెన్నై IITలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్న ఆయనకు ముంబైలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో IMC కంపెనీ ఉద్యోగం కల్పించింది.తండ్రి రమణారెడ్డి స్థానిక సిమెంట్ పరిశ్రమలో ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తున్నారు. కుమారుడు పొందిన ఉద్యోగంతో తల్లిదండ్రులు తులసి, రమణారెడ్డిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


