HomeEntertainment‘ది రాజా సాబ్’ మేకర్స్‌తో ప్రభాస్ మరో మూవీ.. క్రేజీ థ్రిల్లర్ సిద్ధం చేస్తోన్న ‘మిరాయ్’...

‘ది రాజా సాబ్’ మేకర్స్‌తో ప్రభాస్ మరో మూవీ.. క్రేజీ థ్రిల్లర్ సిద్ధం చేస్తోన్న ‘మిరాయ్’ డైరెక్టర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ‘మిరాయ్’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో ప్రభాస్ ఓ హై-వోల్టేజ్ థ్రిల్లర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా కోసం కార్తీక్ కథను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ చిత్రాలను 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత 2028లో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఈగల్’, ‘మిరాయ్’ చిత్రాలతో తన సత్తా చాటిన కార్తీక్ ఘట్టమనేని, ప్రభాస్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments