HomeSportsదటీజ్ బవూమా.. 110/6 నుంచి 425/9కి సౌతాఫ్రికా.. 9 గంటలు క్రీజులో నిలబడ్డ కెప్టెన్..!

దటీజ్ బవూమా.. 110/6 నుంచి 425/9కి సౌతాఫ్రికా.. 9 గంటలు క్రీజులో నిలబడ్డ కెప్టెన్..!

పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఊహించని రీతిలో పుంజుకుంది. ఒకానొక దశలో 12 పరుగులకే 2 వికెట్లు, ఆ తర్వాత 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన సఫారీలను కెప్టెన్ టెంబా బవుమా (179) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆల్‌రౌండర్లు మార్కో జాన్సెన్ (85), సైమన్ హార్మర్ (82)ల నుంచి లభించిన అండతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3/1తో నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments