
అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను వేగంగా తీరం వైపు కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.సోమవారం రాత్రికి గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను నెల్లూరు, కావలికి 80 కి.మీ, ఒంగోలుకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని MD ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటుతుందని పేర్కొన్నారు.తీరం దాటే సమయంలో గంటకు 100-120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ప్రభావం:నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక.నెల్లూరు మహిళా పాలిటెక్నిక్ వద్ద చెట్టు కూలి కారు ధ్వంసం.శింగరాయకొండ, కొత్తపట్నం, పాకల, ఊళ్లపాలెం తీరాల్లో అలల ఉధృతి. పడవలు ఒడ్డుకు తరలింపు.శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 54.25 మి.మీ వర్షపాతం. ఏలూరు, విజయనగరం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.
రైళ్లు, విమానాలు రద్దు: దక్షిణ కోస్తా రైల్వే పలు రైళ్లు రద్దు. ఇండిగో 10, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 2 సర్వీసులు రద్దు.ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.


