HomeAndhra Pradeshమాచర్ల కౌంటింగ్ ను పరిశీలించిన ఉన్నతాధికారులు

మాచర్ల కౌంటింగ్ ను పరిశీలించిన ఉన్నతాధికారులు

మాచర్ల కౌంటింగ్ ను పరిశీలించిన ఉన్నతాధికారులు

మాచర్ల:
మాచర్ల పట్టణంలోని కిడ్స్ పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, గురజాల ఆర్డీఓ ఈ. మురళీకృష్ణ, గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ బి. కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ డి. వేణుబాబు పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకున్న చర్యలను సమీక్షించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం పరిసరాల్లో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments