న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్య చేధనలో తేలిపోయిన తిలక్ వర్మ.. రెండో టీ20లోనూ ఆరంభంలో మెల్లగా ఆడాడు. దీంతో భారత్ ఓటమి తప్పదనిపించింది. కానీ చివర్లో గేర్ మార్చి టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ ఆడిన తీరు పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రశంసలు గుప్పించాడు. తిలక్ మంచి ఆటగాడని.. టెస్టుల్లోనూ భారత జట్టుకు ఆడే అవకాశం అతడికి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు.


