జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఐఐటీ యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్ల విపరీతమైన ఒత్తిడికి చెక్ పెడుతూ, విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని అంచనా వేసే ‘అడాప్టివ్ టెస్టింగ్’ విధానాన్ని 2030 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.


