Andhra Pradesh New Pension Application: ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. గత మూడు రోజులుగా అర్హులైనవారు దరఖాస్తుల్ని సమర్పిస్తున్నారు. అయితే పింఛన్ దరఖాస్తులో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుంగా వారికి సాయం చేాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వృద్ధులు, దివ్యాంగులు సహాయం అందించాలని వీవోఏలు, వీవోవోబీలకు సూచించారు. వీరు దరఖాస్తు ఫారం నింపడం, ఆన్లైన్లో నమోదు చేయిస్తారు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారికి మెరుగైన వసతులు కల్పించాలని కూడా సూచించారు.


