సొరకాయ పేరు వినగానే చాలామంది ముఖం తిప్పుకుంటారు కానీ, ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. పెద్దలు దీన్ని ఇష్టంగా తినడమే కాకుండా పిల్లలకూ అలవాటు చేయాలని చెబుతుంటారు. అయితే నేడు మార్కెట్లో దొరికే సొరకాయ నిజంగానే అంత ఆరోగ్యకరమైందా? కూరగాయలు త్వరగా ఎదగడానికి, తాజాగా కనిపించడానికి ప్రమాదకరమైన రసాయన స్ప్రేలు, ఇంజెక్షన్లు (ఆక్సిటోసిన్ వంటివి) వాడుతున్న సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే చిన్న సొరకాయను పెద్దదిగా చేసేందుకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఇలాంటి కూరగాయలు తింటే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కెమికల్ సొరకాయను గుర్తించే చిట్కాల్ని ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ బధోరియా పంచుకున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.


