కిడ్నీలు మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇవి నిశ్శబ్దంగా పనిచేసే సహజమైన ఫిల్టర్లు. రక్తంలోని వ్యర్థాలు, టాక్సిన్లను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపడం వీటి ప్రధాన విధి. కిడ్నీ వ్యాధుల్ని వైద్యులు, నిపుణులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో కిడ్నీ వ్యాధుల లక్షణాలు చాలా స్వల్పంగా, కేవలం సాధారణ అలసటలా మాత్రమే కనిపిస్తాయి.
వ్యాధి తీవ్రమయ్యే వరకు చాలా మందికి ఈ సమస్య ఉన్నట్టే తెలియదు. అందుకే ప్రారంభ సంకేతాల్ని గమనించాలి. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోని కిడ్నీలను కాపాడుకోవచ్చు. అసలు కిడ్నీ వ్యాధి దశలు ఎన్ని రకాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ముఖ్యమైన పరీక్షలు, ఆహార నియమాలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ దిలీప్ ఎం. బాబు, (సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


