లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్, 103 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంగ్లీష్ పేసర్ల ధాటికి పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 171, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన ఆలీ రాబిన్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


