HomeSportsఆసీస్, బంగ్లా రెండో టెస్టులో బౌలర్ల హవా.. ఒకే రోజు 18 వికెట్ల డౌన్..!

ఆసీస్, బంగ్లా రెండో టెస్టులో బౌలర్ల హవా.. ఒకే రోజు 18 వికెట్ల డౌన్..!

మ్యాకే వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజే బౌలర్ల ఆధిపత్యం నడిచింది. ఏకంగా 18 వికెట్లు పడిన ఈ మ్యాచ్‌లో, మొదట ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) సంచలన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను 64 పరుగులకే కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను బంగ్లా పేసర్ షరీఫుల్ ఇస్లామ్ (6/35) దెబ్బతీయడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 165/8తో నిలిచింది. ఆస్ట్రేలియా 101 పరుగుల కీలక ఆధిక్యంలో నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments