HomeHeadlinesఅరుణాచల్ ప్రదేశ్‌లో నిరసనలు తీవ్రరూపం.. ఎమ్మెల్యే నివాసం లూటీ, ప్రాజెక్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్‌కు నిప్పు

అరుణాచల్ ప్రదేశ్‌లో నిరసనలు తీవ్రరూపం.. ఎమ్మెల్యే నివాసం లూటీ, ప్రాజెక్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్‌కు నిప్పు

ఈశాన్య రాష్ట్రం, చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నిరసనగా తూర్పు సియాంగ్ జిల్లాల్లో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. అలాగే, పోలీస్ స్టేషన్, పవర్ ప్రాజెక్ట్ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. కఠిన ఆంక్షలు ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments