అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ-అమెరికన్ సమాజం అరుదైన ఘనత సాధించింది. ఫ్లాగ్పోల్స్పై ‘250’ సంఖ్యను 1,383 అమెరికా జెండాలతో రూపొందించారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు లభించింది. ఈ 250 సంఖ్యను భారతీయ జెండాలతో చుట్టుముట్టారు. కార్యక్రమంలో భారత కాన్సులేట్ ప్రతినిధులు, స్థానిక అమెరికా ప్రజాప్రతినిధులు, FIA నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. భారత్-అమెరికా స్నేహం, భారతీయ-అమెరికన్ సమాజం ఐక్యతకు ఈ రికార్డు ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
అమెరికాలో భారతీయుల ఘనత.. 1,383 జెండాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు!
RELATED ARTICLES


