
అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేసింది.
ప్రభావిత ఉద్యోగులకు మూడు వారాల గడువు ఇచ్చి, ఇతర దేశాల్లోని ఐబీఎం కార్యాలయాలకు బదిలీ కావాలా? లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలా? అనేది నిర్ణయించుకోవాలని సూచించింది. డిసెంబర్ 31లోగా అమెరికా విడిచి వెళ్తే మూడు నెలల సెవెరెన్స్ ప్యాకేజీ అందించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భారత్కు తిరిగి వస్తే వేతనాల్లో భారీ కోత పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మారుతున్న నైపుణ్యాల అవసరాలు, క్లయింట్ల డిమాండ్లకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఎంతమంది ప్రభావితమయ్యారనే వివరాలను వెల్లడించలేదు.


