HomeTELANGANA'హైదరాబాద్‌ను ఉస్మానిస్థాన్‌గా మార్చాలని నిజాం కుట్ర'

‘హైదరాబాద్‌ను ఉస్మానిస్థాన్‌గా మార్చాలని నిజాం కుట్ర’

సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించకపోవడానికి కాంగ్రెస్‌, భారాస ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు. ఎంఐఎంకు రెండు పార్టీలు భయపడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మహిళల పాత్రను ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తుచేశారు. సెప్టెంబరు 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్రం హైదరాబాద్‌ లిబరేషన్‌ డే వేడుకలు నిర్వహించనుందని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments