హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో అక్రమ నీటి దందాపై హైడ్రా చర్యలు చేపట్టింది. బస్తీల్లో ఏర్పాటు చేసిన అక్రమ బోర్లను తొలగించి, ట్యాంకర్లకు నీటిని సరఫరా చేస్తున్న పైపుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసింది. మరోవైపు, పునరుద్ధరించిన చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో ప్రారంభించే అవకాశం ఉండటంతో హైడ్రా, సీఎంసీ కమిషనర్లు రంగనాథ్, సృజన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎఫ్టీఎల్ హద్దులు, పూడికతీత, ఫెన్సింగ్, బండ్, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, బోటింగ్ జెట్టీల ఏర్పాట్లను సమీక్షించారు.


