షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి వస్తే ముందుగా సీఎం రేవంత్ రెడ్డికే ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యల ఆధారంగా తనకు నోటీస్ వచ్చిందని.. కానీ, పార్టీ లైన్‌కు విరుద్ధంగా ముందుగానే అభ్యర్థుల ప్రకటన, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పుకొంటూ ధిక్కార చర్యలకు పాల్పడుతున్నారని.. అందుకే ముందుగా సీఎంకే షోకాజ్ నోటీసు ఇవ్వాలని మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె వెల్లడించారు. తనపై చర్యల కోసం పార్టీ క్రమశిక్షణ సంఘం అధిష్ఠానానికి నివేదిక పంపిన నేపథ్యంలో పార్టీ పెద్దలకు తన వాదన వినిపించారు.


