సాధారణంగా ఎవరైనా మనం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవాలనుకుంటే BMI చెక్ చేస్తారు. అయితే BMI కేవలం ఎత్తు, బరువుని మాత్రమే చూస్తుంది. మీ బాడీలో కొవ్వు ఎక్కడ పేరుకుపోతుందో అది గుర్తించదు. దీని గురించి క్లియర్గా తెలిపేది కేవలం మీ నడుము చుట్టుకొలత మాత్రమే. సాధారణంగా బరువు ఎంత ఉందో తెలుసుకోవడానికి వేయింగ్ మెషిన్ వాడతాం. ఇక మన హైట్ ప్రకారం ఎంత బరువు ఉండాలో తెలుసుకోవడానికి BMI చెక్ చేస్తాం. అయితే, ఈ రెండు మాత్రం మీ వెయిట్, హైట్ ప్రకారం ఐడియల్ వెయిట్ మాత్రమే చూపిస్తాయి. అలా కాకుండా మనకి ఫ్యూచర్లో వచ్చే జబ్బుల గురించి కూడా అలర్ట్ చేసేదే వెయిస్ట్ లైన్. మన నడుము చుట్టుకొలత కొవ్వులో కొంత భాగం, ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఎక్కడ ఫ్యాట్ పేరుకుపోయిందో సూచిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


