HomeNation and Worldవైద్యచరిత్రలోనే తొలిసారి.. కొండచిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రాణాలు కాపాడిన బ్రిటన్ వైద్యులు!

వైద్యచరిత్రలోనే తొలిసారి.. కొండచిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రాణాలు కాపాడిన బ్రిటన్ వైద్యులు!

వైద్య సాంకేతిక చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక భారీ కొండచిలువకు మనుషులకు అందించే అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను విజయవంతంగా అందించి దాని ప్రాణాలను కాపాడారు. ఇంగ్లాండ్‌లోని చెస్టర్ జూలో నివసిస్తున్న 15 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉన్న ‘జోడీ’ అనే రెటిక్యులేటెడ్ కొండచిలువ దవడ భాగానికి తీవ్రమైన క్యాన్సర్ కణితి సోకింది. జూ వెటర్నరీ వైద్యులు, క్యాన్సర్ నిపుణులు కలసి ‘ఎలక్ట్రోకీమోథెరపీ’ విధానం ద్వారా శస్త్రచికిత్స అందించి దానిని క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments