వెలిగొండ ప్రాజెక్టు ముప్పై ఏళ్ల తర్వాత పూర్తయిందని, ఈ ప్రాజెక్టుతో ఆ ప్రాంతవాసుల కల నేరవేరిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఎన్టీఆర్, వైఎస్సార్‌కే ఇవ్వాలని నారాయణ అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూల సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం పోరాడారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో చురుకుగా పనులు సాగాయని.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంత చిత్తశుద్ధిగా చేయలేదన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి వెలిగొండను పూర్తి చేశారని నారాయణ అన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ వైఎస్సార్‌దే.. ఎన్టీఆర్ ఉన్నప్పుడే బీజం: సీపీఐ నారాయణ
RELATED ARTICLES


