
ఒక్క రోజు పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజి బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఏం ప్రస్తావించారనేది మాత్రం తెలియరాలేదు. ఇక, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన భేటీలు ఏపీకి మరో రెండు రైళ్లను అదనంగా నడపాలని కోరాారు. ఇందులో ఒకటి వందేభారత్ స్లీపర్ రైలు విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు నడుపుతారు.


