HomeNation and Worldవిమానం గాల్లో ఉండగానే ఇద్దరు ప్రయాణికుల ఫైట్.. ఒకరినొకరు తీవ్రంగా గుద్దుకున్న వైనం.. వీడియో వైరల్

విమానం గాల్లో ఉండగానే ఇద్దరు ప్రయాణికుల ఫైట్.. ఒకరినొకరు తీవ్రంగా గుద్దుకున్న వైనం.. వీడియో వైరల్

లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు ప్రయాణిస్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గొడవ పడ్డారు. మొదట మాటలతో మొదలైన వీరి వాగ్వాదం క్షణాల్లోనే ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘర్షణలో ఒకరి షర్టు చిరిగిపోగా… విమానంలోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్యాబిన్ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో యాజమాన్యం విచారణకు ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments