వరల్డ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టుతో మంగళవారం (సెప్టెంబర్ 22) జరగబోయే చారిత్రక టీ20 మ్యాచ్ జపాన్ క్రికెట్కు ఒక మైలురాయి లాంటిదని జపాన్ కెప్టెన్ కెండల్ కడోవాకి ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు. జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ఎన్నాళ్లగానో కంటున్న కల నిజమవుతోందని అతడు సంతోషం వ్యక్తం చేశాడు. 41వ ర్యాంకులో ఉన్న జపాన్ జట్టు, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లతో పోటీపడటం ద్వారా దేశంలో క్రికెట్ ప్రాచుర్యం విపరీతంగా పెరుగుతుందని ఆశిస్తోంది.


