HomeEntertainmentవనదేవతల సన్నిధిలో ‘ది ప్యారడైజ్’ టీమ్: సమ్మక్క-సారలమ్మకు నాని నిలువెత్తు బంగారం మొక్కు

వనదేవతల సన్నిధిలో ‘ది ప్యారడైజ్’ టీమ్: సమ్మక్క-సారలమ్మకు నాని నిలువెత్తు బంగారం మొక్కు

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రారంభంలో నెగెటివ్ టాక్, విమర్శలు వచ్చినప్పటికీ నాని క్రేజ్‌తో తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ విజయోత్సాహంలో చిత్ర బృందం ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లిని దర్శించుకుని, అనంతరం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంది. నాని అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments