రష్యా నుంచి డీజిల్ దిగుమతిపై అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా.. ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై రెట్టింపు సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగుతోంది. కానీ, అదే రష్యా నుంచి అగ్రరాజ్యం డీజిల్ కొనుగోలు చేయడం దాని ద్వంద్వ నీతికి నిదర్శనం. తాజాగా, ఈ ఒప్పందంపై ఇటలీ ప్రధాని మెలోనీ ఆందోళన వ్యక్తం చేశారు.


