ఎస్ఐఆర్ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ 2.0 నిరసన చేపట్టింది. ఈ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు.. ఎక్కకక్కడ నిరసనకారులు అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యమంతో వామపక్ష విద్యార్థి విభాగం అధ్యక్షురాలు నేహా బోరా గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఆమె ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేది నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన ఆమె బీజేపీకి మద్దతిచ్చే కుటుంబం నుంచి రావడం మరో విశేషం.


