‘ధరణి ఐ లవ్ యు’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఘనంగా ఆవిష్కరించారు. గతంలో దర్శకుడు రాజమౌళి వద్ద ‘మగధీర’ చిత్రానికి అసోసియేట్‌గా పనిచేసిన సాయికృష్ణ కె.వి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్, పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని పేర్కొన్న ఎస్కేఎన్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వరుస విజయాలతో బిజీగా ఉన్న ఎస్కేఎన్ తమ పోస్టర్ లాంచ్ చేయడం గొప్ప ప్రారంభాన్ని ఇచ్చిందని చిత్ర దర్శకుడు సాయికృష్ణ, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, ప్రధాన తారాగణం వంశీ, మహిత ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.
యూత్‌ను ఆకట్టుకునేలా ‘ధరణి ఐ లవ్ యు’… పోస్టర్ విడుదల చేసిన నిర్మాత ఎస్కేఎన్
RELATED ARTICLES


