అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎద్దేవా చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకు అసలు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంలో ఉన్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మార్కో రూబియో న్యూఢిల్లీ పర్యటనను రద్దు చేస్కుని ముంబయి, జామ్ నగర్ మాత్రమే వెళ్లనున్నారు. ఈక్రమంలోనే అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ముంబయిలో తమతో విదేశాంగ మంత్రి జైశంకర్ కలుస్తున్నట్లు ఆశిస్తున్నామని అన్నారు. దీన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.


