వయసొచ్చిన మేజర్ అయిన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమ వద్దే నివసించాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని, అలాంటి ఉద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే చెల్లవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తన తల్లి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఢిల్లీలో స్వతంత్రంగా జీవిస్తున్న 25 ఏళ్ల యువతి కేసును విచారించిన జస్టిస్ సందీప్ జైన్ ధర్మాసనం.. మేజర్‌కు నచ్చిన చోట, నచ్చిన వ్యక్తితో నివసించే హక్కు ఉందని చెబుతూ సంచలన తీర్పును ఇచ్చింది.


