మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఒక బిజినెస్మెన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని.. అందుకు నిరాకరించడంతో తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని ఆ బిజినెస్మెన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


