HomeAndhra Pradeshభోగాపురం ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం... స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కోల్‌కతా వాసి... ఎన్ని...

భోగాపురం ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం… స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కోల్‌కతా వాసి… ఎన్ని కిలోలు స్వాధీనం చేసుకున్నారంటే?

భోగాపురం ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం రేగింది. ముందస్తు సమాచారంతో విశాఖపట్నం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఒక వ్యక్తి దగ్గర హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించారు. నిందితుడి దగ్గర నుంచి మొత్తం నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపుగా రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా అరెస్టైన వ్యక్తి కోల్‌కతాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (36)ను గుర్తించడం జరిగింది. నిందితుడు గంజాయిని బ్యాంకాక్‌లో సేకరించి… సింగపూర్‌ మీదుగా తరలించినట్టు అధికారులు గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments