పాకిస్థాన్ క్రికెట్ దారుణ పతనానికి 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై సాధించిన విజయమే ప్రధాన కారణమని పాక్ మాజీ ప్లేయర్ మహమ్మద్ యూసుఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ గెలుపు తర్వాత ఆటగాళ్లలో అహంకారం పెరిగిపోయిందని విమర్శించాడు. మ్యాచ్ గెలవడం కంటే కెప్టెన్సీ కోసం కొట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించాడు. ఆ మ్యాచ్ తర్వాత తమ జట్టు ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శన చేయడాన్ని యూసుఫ్ గుర్తు చేశాడు.


