ఆలివ్ ఆయిల్ బ్రెయిన్ పనితీరుపై ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ని రిఫైండ్ ఆలివ్ ఆయిల్ నుండి వేరు చేసి చూడాలి. సాధారణ లేదా స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్స్ కెమికల్ రియాక్షన్, హై టెంపరేచర్‌తో ప్రాసెస్ అవుతాయి. దీంతో వాటిలోని కీ బయోయాక్టివ్ సమ్మేళనాలు తొలగిపోతాయి. దీనికి విరుద్ధంగా, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ప్రాసెసింగ్‌కి గురవ్వదు. పైగా కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తీస్తారు. అందుకే, దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతారు. మరి, ఈ ఆయిల్‌ని తీసుకుంటే నిజంగానే బ్రెయిన్ చక్కగా పనిచేస్తుందా అనేది డాక్టర్ అపర్ణా విజయ్ కుమార్(సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ, సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్లగండ్ల, హైదరాబాద్) చెబుతున్నారు. అతేకాకుండా, ఎలా తీసుకోవాలో కూడా సూచిస్తున్నారు.


